హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూసీకి భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు

SRPT: ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ రిజర్వాయర్‌కు ఈరోజు సాయంత్రం వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 640.58 అడుగులకు చేరిందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. దీంతో పెన్పహాడ్ మండల పరిధిలోని మూసీ తీరప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.