హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణపతి నిమర్జనానికి పటిష్ట బందోబస్తు: ఎస్పీ

ADB: ఆదిలాబాద్‌లో గణపతి నిమర్జనోత్సవానికి పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు SP అఖిల్ మహాజన్ గురువారం తెలిపారు. 600 మంది సిబ్బంది, 600 సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 13 సెక్టార్లు, 13 క్లస్టర్లు, 23 పికెట్లు, రూఫ్ టాప్ బందోబస్తుతో పాటు 2 స్ట్రైకింగ్ ఫోర్సులు, మఫ్టీ పోలీసులను మోహరించనున్నట్లు పేర్కొన్నారు.