హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశుడి లడ్డూను దక్కించుకున్న ముస్లిం యువకుడు

NRPT: ఉట్కూర్ మండలం పెద్దపొర్లలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి లడ్డూను మౌలానా అనే ముస్లిం సోదరుడు రూ. 65 వేలకు వేలంలో దక్కించుకున్నారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ వేలం పాట ఉత్సాహంగా సాగింది. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలందుకున్న వినాయకుడిని అనంతరం కమిటీ సభ్యులు, గ్రామస్థులు కలిసి ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు.