హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాలు.. తోట పంటలకు తీవ్ర నష్టం

భారీ వర్షాలు, ఈదురుగాలులతో కాకినాడ జిల్లాలో తోట పంటలు దెబ్బతిన్నాయి. గొల్లప్రోలు మండలం దుర్గాడలో ఉద్యానశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను గురువారం పరిశీలించి, రైతులకు సూచనలు చేశారు. ప్రాథమికంగా 70 మంది రైతులకు చెందిన 34.80 హెక్టార్లలో అరటి, బొప్పాయి, కూరగాయ పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. వర్షాలు తగ్గిన తర్వాత సమగ్ర నష్టం అంచనా వేయనున్నారు.