హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ

NRPT: కృష్ణా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఎంపీడీవో ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి అధికారులు, కాంగ్రెస్ నాయకులు, సర్పంచుల సమక్షంలో కార్యక్రమం జరిగింది. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ద్వారా ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని అధికారులు తెలిపారు.