హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద కలుషితమైన గోదావరి

E.G: రాజమండ్రి నగరంలోని పుష్కర స్నాన ఘాట్ వద్ద గోదావరి నది ప్లాస్టిక్ వ్యర్థాలు, పూజా సామగ్రితో కలుషితంగా మారింది. పెద్దఎత్తున వ్యర్థాలు ఒడ్డుకు చేరడంతో స్నాన ఘాట్ అపరిశుభ్రంగా తయారైంది. మరోవైపు గణేష్ నిమజ్జనోత్సవాలు కొనసాగుతుండటంతో నదిలో పుణ్యస్నానం ఆచరించాలనుకున్న భక్తులు నిరాశకు గురవుతున్నారు.