హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల సెలవులు రద్దు: కలెక్టర్

ATP: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తూ కలెక్టర్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 25 నుంచి 28 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో సిబ్బంది హెడ్‌క్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అనుమతి లేని కార్యక్రమాల్లో స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులు పాల్గొంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.