E.G: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. గురువారం అధికారులతో కలిసి వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు, బాలాజీపేటలో ఆయన పర్యటించారు. రెండు, మూడు రోజుల్లో పరిస్థితులను అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్


