MBNR: వృద్ధులను ప్రేమతో గౌరవంతో చూసుకోవాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. అంతర్జాతీయ వృద్ధుల వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వృద్ధుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. వారి సంరక్షణ పిల్లల బాధ్యత అని వెల్లడించారు.
తెలంగాణ
వృద్ధులను గౌరవంతో చూసుకోవాలి: కలెక్టర్


