హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారుల ఆరోగ్యంపై MLA ఆరా

ADB: ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన ఘటనలో ప్రభావితమై భూకాపూర్ సురక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి చిన్నారులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే హైదరాబాద్‌కు తరలించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.