NRML: గణపతి నిమజ్జనం కోసం బాసరకు వచ్చిన ఓ యువకుడు గోదావరిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఎల్వి గ్రామానికి చెందిన లోకండే విశాల్(25) నిమజ్జనం అనంతరం భోజనం చేసేందుకు సత్రానికి వెళ్లి, తిరిగి ఒక్కడే స్నానానికి గోదావరి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడి తల్లి కమలబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసామన్నారు.
తెలంగాణ
నిమజ్జనానికి వెళ్లి యువకుడు మృతి


