హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 25 నుంచి 30 వరకు ఆందోళనలు: TUCI

KMM: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో నంబర్‌ 6ను అన్ని రంగాల కార్మికులకు వర్తింపచేయాలని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.రామయ్య డిమాండ్‌ చేశారు. గురువారం ఖమ్మంలో కార్మికులతో కలిసి కరపత్రాన్ని ఆవిష్కరించారు. కనీస వేతనాల జీవోలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ నెల 25 నుంచి 30 వరకు వివిధ కార్మిక రంగాల వద్ద ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.