హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధికారులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

SKLM: లావేరు మండలం బుడుమూరు పంచాయతీలోని పలు గ్రామాలలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ మేరకు బుడుమూరు సంతతోట వద్ద రోడ్డు పక్కన ఉన్న బెంచ్ పై ఎమ్మెల్యే కుర్చుని, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. ప్రజల మధ్య సాధారణ వ్యక్తిలా గడుపుతూ ఎమ్మెల్యే చూపిన ఈ నిరాడంబరత అందరినీ ఆకట్టుకుంది.