ఆసిఫాబాద్ మండలం బూరుగుడలో వృద్ధురాలు మల్లక్క హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ నితికా పంత్ వివరాలు వెల్లడించారు. బంగారు చెవి కమ్మల కోసం ధనుంజయ్ ఆగస్టు 30న మల్లక్క ఇంట్లోకి చొరబడి బండరాయితో కొట్టి హత్య చేసినట్లు తెలిపారు. అనంతరం బంగారాన్ని ప్రవీణ్ సహాయంతో మహేష్‌కు రూ.32 వేలకు విక్రయించినట్లు పేర్కొన్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.
తెలంగాణ
మల్లక్క హత్య కేసులో ముగ్గురు అరెస్ట్


