హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండల ప్రత్యేక అధికారిగా దామోదరం

ELR: భీమడోలు మండల ప్రత్యేక అధికారిగా దామోదరం నియమితులయ్యారు. మండల పరిషత్ పాలక మండలి పదవీకాలం ఈ నెల 23వ తేదీతో పూర్తయిన నేపథ్యంలో కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఆయనను నియమించారు. ప్రస్తుతం డ్వామా జంగారెడ్డిగూడెం ఏపీడీగా పనిచేస్తున్న దామోదరంకు అదనపు బాధ్యతగా భీమడోలు మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు అప్పగించారు. గురువారం ఆయన తన బాధ్యతలను స్వీకరించారు.