హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఐలాపురం బ్రిడ్జిపై భారీ గోతులు.. రేగా పరిశీలన

BDK: పినపాక మండలం మణుగూరు–ఏటూరునాగారం ప్రధాన రహదారిపై ఐలాపురం బ్రిడ్జిని గురువారం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరిశీలించారు. బ్రిడ్జిపై భారీ గోతులు ఏర్పడి ఇనుప సువ్వలు బయటకు వచ్చి ప్రమాదకరంగా మారాయని తెలిపారు. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.