కోనసీమ: భారీ వర్షాల నేపథ్యంలో కొత్తపేట డివిజన్‌లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో సత్యనారాయణ తెలిపారు. ఈనెల 26 నుంచి 28 వరకు గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు, వరదలకు సంబంధించిన సమస్యలను కొత్తపేట కంట్రోల్ రూమ్ 08855-244299కు తెలియజేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'వర్షాలపై కొత్తపేటలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు'


