నంద్యాల జిల్లాలో మలేరియా, డెంగ్యూ నివారణకు గంబూషియా చేపలను నీటి వనరుల్లో వదిలారు. చెరువులు, బావులు, కుంటల్లో చేపలను వదిలి దోమల లార్వా పెరుగుదలను అరికట్టే చర్యలు చేపట్టారు. తిమ్మాపురం, నాగులుటి గ్రామాలతో పాటు నందికొట్కూరులోని ఎన్టీఆర్ జలాశయంలో చేపలను వదిలారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సీ.చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది, ఆశాలు, పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దోమల నివారణకు గంబూషియా చేపలు


