KKD: తుఫాన్ ప్రభావంతో కిర్లంపూడి మండలంలో సుమారు 650 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు ఏవో సుధా మాధురి తెలిపారు. రామకృష్ణాపురం, చిల్లంగి, కిర్లంపూడి గ్రామాల్లో ముంపు పొలాలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. పొలాల్లో నిలిచిన నీటిని త్వరగా బయటకు పంపేందుకు పిల్ల కాలువలు ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే ఆయిల్ ఇంజిన్లను వినియోగించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కిర్లంపూడిలో 650 ఎకరాల్లో వరి పంట నీట మునక


