SKLM: భారీ వర్షాలతో మెళియాపుట్టి మండలంలో 230 ఎకరాల వరి ముంపునకు గురైనట్లు వ్యవసాయాధికారి ఎస్. దానకర్ణుడు తెలిపారు. ఈ మేరకు పెద్దపద్మాపురం, సిరియాకండి, కొమ్మూరుతో సహా 13 గ్రామాల్లో గురువారం పంట పొలాలను పరిశీలించారు. పొలాల నుంచి నీరు బయటకు వెళ్లేలా కాలువలు ఏర్పాటు చేసుకోవాలని, నీరు తగ్గాక యూరియా, పొటాష్ వేసుకోవాలని రైతులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
230 ఎకరాల్లో వరి ముంపు


