హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాగులు, కాజ్‌వేల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయండి: కలెక్టర్

ELR: జిల్లాలో భారీ వర్షాల సూచనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం జిల్లా అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. తమ్మిలేరు, బుడమేరుతో పాటు వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రమాదకర ప్రదేశాలు, కాజ్‌వేల వద్ద హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.