హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠలో ఎమ్మెల్యే

ప్రకాశం: అర్ధవీడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించిన శ్రీ సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.