BHNG: రాజాపేట మండల కేంద్రంలోని శ్రీ రామకృష్ణ సాయి మందిరంలో గురువారం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడికి లక్ష ఉండ్రాళ్లను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ దాతలు బెజగం శ్రీనివాసులు–రాజేశ్వరి దంపతులు తొలుత పూజలు చేశారు. అనంతరం ప్రధాన అర్చకులు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద్ శర్మ మంత్రోచ్ఛారణల మధ్య భక్తులు ఉండ్రాళ్లు సమర్పించారు.
తెలంగాణ
లంబోదరుడికి లక్ష ఉండ్రాళ్ల సమర్పణ


