ASR: పాడేరు మండలం వంతాడపల్లిలో భారీ వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టును కలెక్టర్ నిశాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ గురువారం పరిశీలించారు. ప్రమాద నివారణకు ఇసుక మూటలతో చేపట్టిన తాత్కాలిక రక్షణ పనులను పరిశీలించి సూచనలు చేశారు. కల్వర్టుకు శాశ్వత మరమ్మతులు, నూతన నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాహనదారులు, బాటసారులు జాగ్రత్తగా వెళ్లాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కల్వర్టును పరిశీలించిన కలెక్టర్


