హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కాంప్లెక్స్‌ను లాటరీతో కేటాయించాలి'

ASR: అరకు మండలం పెదలబుడు పంచాయతీలోని షాపింగ్ కాంప్లెక్స్‌ను స్థానిక గిరిజన నిరుద్యోగ యువతకు లాటరీ పద్ధతిలో కేటాయించాలని సీపీఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం రెవెన్యూ, మండల పరిషత్ అధికారులకు వినతిపత్రం అందించారు. నిబంధనల ప్రకారం బహిరంగ ప్రకటన చేయాలని, లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.