హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమస్యలపై ఎమ్మెల్యేకు వినతులు ఇవ్వొచ్చు'

CTR: పూతలపట్టు నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మురళీమోహన్ శుక్రవారం నిర్వహించనున్నారు. చిత్తూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కార్యక్రమం జరగనుంది. ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేయవచ్చని ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ చూపుతారని పేర్కొంది.