హైదరాబాద్: 28°C
తెలంగాణ

'AI పోర్టల్‌పై అవగాహన కలిగి ఉండాలి'

PDPL: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు స్మార్ట్‌ అసెస్‌మెంట్‌ పోర్టల్‌పై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్‌ బి.శ్రీరాములు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఫొటో సాక్ష్యాలను ఏఐ పరిశీలించి L0 నుంచి L5 వరకు గ్రేడింగ్‌ ఇస్తుందని తెలిపారు. తాత్కాలిక కేంద్రాలకు L3, శాశ్వత కేంద్రాలకు L4 గ్రేడింగ్‌ తప్పనిసరి అన్నారు.