CTR: విద్యార్థులు సమాజసేవకు ప్రాధాన్యం ఇవ్వాలని DIEO రవి సూచించారు. సదుం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో NSS దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం ఎంతో ముఖ్యమని, వాటితోనే జీవితంలో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ‘నాకోసం కాదు.. సమాజం కోసం’ అనే నినాదంతో పనిచేసే NSS ద్వారా సేవ చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
‘నాకోసం కాదు.. సమాజం కోసం’: DIEO


