ప్రకాశం: పామూరు మండలం మోపడు కొండారెడ్డిపల్లెలో గురువారం గోకులం షెడ్‌ను మండల టీడీపీ అధ్యక్షుడు బొల్లా నరసింహారావు ప్రారంభించారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పామూరులో గోకులం షెడ్డు ప్రారంభం


