హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షానికి కూలిన ఇల్లు

SRPT: మోతె మండల కేంద్రంలో గురువారం కురిసిన భారీ వర్షానికి లింగాల లక్ష్మీ, యాదగిరి దంపతుల సిమెంట్‌ గోడల ఇల్లు కూలిపోయింది. రాత్రి నుంచి కురిసిన వర్షానికి గోడలు నాని బలహీనపడి ఉదయం ఒక్కసారిగా కూలాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇంట్లోని వంట సామగ్రి, బట్టలు, ఇతర వస్తువులు శిథిలాల కింద చిక్కుకుని దెబ్బతిన్నాయి.