హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేను కలిసిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు

NRML: నిర్మల్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కలిశారు. గురువారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. గణేష్ నిమజ్జనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు, తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసేలా అధికారులకు సూచించాలని కమిటీ సభ్యులు కోరారు.