హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెత్త వర్గీకరణ పై అవగాహన కార్యక్రమం

SRD: బొల్లారం డివిజన్ పరిధిలో స్వచ్ఛతా హీ సేవా–2026లో భాగంగా గురువారం చెత్త వర్గీకరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అమీన్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కాలనీల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. తడి, పొడి, శానిటరీ, ప్రమాదకర చెత్తను వేర్వేరుగా స్వచ్ఛ ఆటోలకు అందించాలని సూచించారు.