హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెత్త వేరు చేసే విధానంపై అవగాహన

KDP: ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంలో భాగంగా కడప నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని జోన్‌లలో గురువారం చెత్త వేరు చేసే విధానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తడి, పొడి చెత్తను ఇంటి వద్దే వేర్వేరుగా చేసి పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని ప్రజలకు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా సహకరించాలని కోరారు.