హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగిసిన యువ టూరిజం క్లబ్స్ పోటీలు

MNCL: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి యువ టూరిజం క్లబ్స్ పోటీలు గురువారం ముగిశాయి. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని స్థానిక సంస్కృతి, చారిత్రక కట్టడాల వైభవాన్ని చాటిచెబుతూ తమ సృజనాత్మకత, ప్రతిభను కనబరిచారు. ప్రథమ స్థానాల్లో నిలిచిన బృందాలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ప్రిన్సిపల్ డా. నరేందర్ రెడ్డి తెలిపారు.