హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లంక భూముల సమస్యపై ఫిర్యాదు

కృష్ణా: ఉయ్యూరులో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ఆర్డీవో కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామంలోని లంక భూములకు సంబంధించిన సమస్యలపై ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సమస్యను వివరించి, పరిష్కరించాలంటూ వినతిపత్రం అందజేశారు. లంక భూముల సమస్యపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అనిల్‌కుమార్‌ కోరారు.