హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డప్పు కళాకారులకు విక్కుర్తి హామీ

కృష్ణా: డప్పు కళాకారుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అవనిగడ్డ టీడీపీ ఇన్‌ఛార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. గురువారం ఘంటసాల, చల్లపల్లి మండలాల కళాకారులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నుంచి కళాకారులకు అందాల్సిన సహాయ సహకారాలు అందేలా చూస్తానని ఆయన భరోసా ఇచ్చారు.