HYD: వర్షం కారణంగా చార్మినార్‌లోని లాడ్ బజార్ వైపు సున్నపు పూత ఊడిపడింది. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ , పురాతత్వ శాఖ అధికారులతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చార్మినార్ ప్రధాన నిర్మాణానికి ఎలాంటి ప్రమాదం లేదని ఎమ్మెల్యే తెలిపారు. పురాతత్వ నిపుణుల పర్యవేక్షణలో దెబ్బతిన్న ప్రాంతానికి శాస్త్రీయ పద్ధతిలో త్వరలోనే మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
చార్మినార్‌పై ఊడిన సున్నపు పూత


