VZM: జిల్లాపై తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతోందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ వాయుగుండం ప్రస్తుతం కలింగపట్నానికి 90 కి.మీ.ల దూరంలో ఉందని పేర్కొన్నారు. అయితే, ఇవాళ సాయంత్రానికి ఇది బలహీనపడి, రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'


