రోహిత్ శర్మతో తనకు విభేదాలు ఉన్నట్లు జరుగుతున్నది కేవలం ప్రచారం మాత్రమేనని కోచ్ గంభీర్ స్పష్టం చేశాడు. రోహిత్‌కు తనకు మధ్య మంచి అనుబంధం ఉందన్నాడు. రోహిత్ జట్టులోకి వచ్చే సమయానికి తాను సీనియర్ ప్లేయర్ అని.. అప్పటినుంచే తమ మధ్య మంచి స్నేహం ఉందని తెలిపాడు. అయితే, ఒక్కోసారి తమ మధ్య భిన్నాభిప్రాయాలు రావొచ్చని.. కానీ జట్టు ప్రయోజనాలకు ఏది ముఖ్యమో అదే తుది నిర్ణయం అవుతుందన్నాడు.
క్రీడలు
రోహిత్ శర్మతో విభేదాలపై గంభీర్ క్లారిటీ


