హైదరాబాద్: 28°C
క్రీడలు

తాను ఆడినవాళ్లలో కోహ్లీనే బెస్ట్: మోహిత్ శర్మ

టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్‌ మోహిత్ శర్మ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తాను కలిసి ఆడిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్లేయర్‌గా పేర్కొన్నాడు. అలాగే, తాను ఎదుర్కొన్న బ్యాటర్లలో రోహిత్ శర్మ అత్యుత్తమమని చెప్పాడు. ఇక అత్యుత్తమ కెప్టెన్‌గా ఎంఎస్‌ ధోనీని ఎంచుకున్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌ బుమ్రా అని తెలిపాడు.