NTR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో తిరువూరులో బుధవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్ జలమయమై, ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోకి కూడా వరద నీరు చేరింది. పలుచోట్ల రహదారులు కాలువలను తలపించాయి.
ఆంధ్రప్రదేశ్
తిరువూరు బస్‌స్టాండ్ జలమయం


