GDWL: ఖమ్మంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) 4వ జాతీయ మహాసభల గోడపత్రికను గద్వాల న్యూడెమోక్రసీ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. రైతులు, కూలీల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణకు ఈ సభలు కీలకమని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు జమ్మిచేడు కార్తీక్ పేర్కొన్నారు. 28న జరిగే బహిరంగ సభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి: కార్తీక్


