హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యాజమాన్యంపై బాలల హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం

ATP: అనంతపురంలోని ట్రెల్లిస్ స్కూల్‌ను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చల్లా మధుసూదనరావు, ఉండవల్లి గాంధీ బాబు గురువారం సందర్శించారు. ఇటీవల పాఠశాలలో చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటనను సుమోటోగా స్వీకరించి తనిఖీలు చేపట్టారు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం, చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ లేకపోవడంపై యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.