హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నీటి మునిగిన బస్టాండ్ ప్రాంగణం

కృష్ణా: గుడివాడలో కురుస్తున్న వర్షాల కారణంగా బస్టాండ్ ఆవరణలో గురువారం వర్షపు నీరు చేరింది. బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల రాకపోకలు, ప్రయాణికుల రాకపోకలకు నీరు అడ్డంకిగా మారింది. బస్టాండ్ ఆవరణలో నిలిచిన వర్షపు నీటిని త్వరితగతిన తొలగించి, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.