VZM: తుఫాను భద్రతా చర్యల్లో భాగంగా గజపతినగరం మండలం మర్రివలస గ్రామానికి వెళ్లే మార్గంలోని చంపావతి నది ఉధృతంగా ప్రవహించడంతో గ్రామస్థులను పోలీసులు అప్రమత్తం చేశారు. నదీ ప్రవాహం ఉధృతంగా ఉన్నందున ఎవరూ నదిని దాటి వెళ్లవద్దని ఎస్సై కిరణ్‌కుమార్ నాయుడు సూచించారు. ఈ సందర్భంగా నదిని దాటకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చంపావతి నది వద్ద పోలీసుల అవగాహన


