హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆధునిక సాంకేతికతతో మెరుగైన పోలీసింగ్‌'

SKLM: పోలీసు విధుల్లో ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం తండేవలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి శిక్షణ కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు. ఆయన వెంట అదనపు ఎస్పీ పి. శ్రీనివాసరావు ఉన్నారు.