కృష్ణా: గుడివాడ టిడ్కో కాలనీ సమీపంలోని ఎన్టీఆర్ నగర్‌లో సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గురువారం వాపోయారు. వర్షాలకు రహదారులు బురదమయంగా మారడంతో రాకపోకలకు అవస్థలు పడుతున్నామని తెలిపారు. అధికారులు స్పందించి, వర్షపు నీరు బయటకు వెళ్లేలా డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షపు నీటితో ప్రజలకు ఇబ్బందులు


