MDK: శివ్వంపేట మండలం గుండ్లపల్లిలో విద్యుదాఘాతానికి గురైన వృద్ధుడు ఎల్లయ్య (60) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. బుధవారం తన అల్లుడి భవనంపై ఆరేసిన బట్టలు తీస్తుండగా విద్యుత్ వైర్ తగిలి ఎల్లయ్య కిందపడి గాయపడ్డాడు. కుటుంబీకులు ఆయనను ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచాడు. మృతుడు వెల్దుర్తి (M) యశ్వంత్‌రావు పేట వాసి.
తెలంగాణ
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి


