హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తప్పుడు కేసులు పెడతామని బెదిరించారు'

RR: అత్తాపూర్ PSలో పోలీసులు తనతో పాటు సహచర న్యాయవాదితో దురుసుగా ప్రవర్తించారని లాయర్ ఫిజా ఆరోపించారు. వీడియో రికార్డింగ్‌పై ప్రశ్నించగా ఫోన్ లాక్కునేందుకు, బయటకు పంపేందుకు పోలీసులు ప్రయత్నించారని తెలిపారు. కేసులో రాజీ చేసుకోకపోతే తప్పుడు కేసులు పెడతామని హెచ్చరించినట్లు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై SHO స్పందించాల్సి ఉంది.