హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాత భవనాల్లో విధులు.. ఉద్యోగుల అవస్థలు

VKB: జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల భవనాల పరిస్థితి అధ్వానంగా మారింది. పాత భవనాల్లోనే విధులు నిర్వహించాల్సి వస్తుండటంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో పైకప్పుల నుంచి నీరు కారడంతో పనులకు ఆటంకం ఏర్పడుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రమాదకరంగా మారిన భవనాల స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.